నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సినిమా 5 రోజుల్లో ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. కానీ మొదటి రోజు లెవల్ లో రికార్డ్ లెవల్ కలెక్షన్స్ ని అందుకోక పోయినా కానీ సినిమా ఉన్నంతలో ఓన్లీ మాస్ కంటెంట్ తోనే ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ముఖ్యంగా బాలయ్య కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా…
పండగ వీకెండ్ తర్వాత సినిమా ఇప్పుడు 6వ రోజు వర్కింగ్ డే లోకి ఎంటర్ అవ్వగా సినిమా నైజాంలో హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకుని తిరిగి ఈవినింగ్ షోలకు కొద్ది వరకు గ్రోత్ ని సొంతం చేసుకుంది. ఇక సీడెడ్ లో, వైజాగ్, గుంటూరు, కృష్ణాలో మంచి హోల్డ్ ని చూపించింది.
మొత్తం మీద సినిమా 5వ రోజుతో పోల్చితే 6వ రోజు సినిమా 60% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. తిరిగి ఈవినింగ్ షోలలో గ్రోత్ కనిపించింది. మొత్తం మీద సినిమా ఈ ట్రెండ్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 3-3.20 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకోవచ్చు…
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ కలెక్షన్స్ కొంచం పెరగవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా అటూ ఇటూగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 3.60 కోట్ల షేర్ ని అందుకోవచ్చు. సినిమా కనుక 4 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటే 6వ రోజు చాలా బాగా హోల్డ్ చేసింది అని చెప్పొచ్చు. ఇక టోటల్ గా సినిమా 6 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.