మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ప్రతీ రోజూ అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా 5వ రోజు వర్కింగ్ డే లో అనుకున్న అంచనాలను భారీ మార్జిన్ తో బీట్ చేసి దుమ్ము దులిపేసింది. ఇక ఇప్పుడు 6వ రోజు మరో వర్కింగ్ డే లో ఎంటర్ అయిన సినిమా నైజాంలో డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా తిరిగి మ్యాట్నీ షోల నుండి ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసింది…
మిగిలిన అన్ని చోట్లా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసింది. సీడెడ్ ఆంధ్ర ఏరియాల్లో సినిమా డ్రాప్స్ 25% రేంజ్ లోనే ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక ఓవరాల్ గా డ్రాప్స్ 5వ రోజుతో పోల్చితే….
30% రేంజ్ లో డ్రాప్స్ ఉన్నాయి అని చెప్పాలి ఇప్పుడు. దాంతో సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో అటూ ఇటూగా 6 కోట్ల నుండి 6.2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పాలి. సినిమా ఈ మార్క్ ని దాటితే 6వ రోజు వర్కింగ్ డే లో ఊచకోత కోసింది అని చెప్పొచ్చు.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 కోట్ల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా సొంతం చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర రాంపేజ్ ని చూపిస్తూ దూసుకు పోతున్నాడు మెగాస్టార్… ఇక ప్రీవియస్ రోజుల మాదిరిగా ఈ రోజు కూడా సినిమా అంచనాలను మించిపోతుందో లేదో చూడాలి.