బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ సెన్సేషనల్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి డిసాస్టర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ దిశగా వెళుతున్న విషయం తెలిసిందే. కాగా సినిమా వర్కింగ్ డేస్ లో దారుణంగా పడిపోగా ఏ దశలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపించలేక పోతుంది ఈ సినిమా ఇప్పుడు.
కాగా 5వ రోజునే చాలా సెంటర్స్ లో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా 6వ రోజు మరింతగా డ్రాప్ అవ్వగా టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో రెండు మూడు సెంటర్స్ మినహా మిగిలిన సెంటర్స్ లో థియేటర్స్ రెంట్స్ కి తగ్గ డబ్బులు కూడా…
కలెక్ట్ చేయలేక పోయింది. దాంతో సినిమా 6వ రోజు డెఫిసిట్ లు, నెగటివ్ షేర్స్ ని తీసేస్తే ఆల్ మోస్ట్ షేర్ జీరో అనిపించుకునే రేంజ్ లో వచ్చింది, కానీ డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని తీయకపోవడంతో 6 లక్షల రేంజ్ లో షేర్ ని రిపోర్ట్ అయింది.
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న దాని కన్నా కూడా మించి భారీ డిసాస్టర్ గా నిలిచింది ఇప్పుడు. ఇక మిగిలిన రన్ లో కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకుని నష్టాలను కొద్ది వరకు కూడా తగ్గించుకునే అవకాశం కూడా లేదనే చెప్పాలి ఇప్పుడు.