టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర 2017 సంక్రాంతికి ఖైదీ నంబర్ 150 తో మెగా రీ ఎంట్రీ ఇచ్చి సెన్సేషనల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా షేర్ ని అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా హిట్ తర్వాత చిరంజీవి చేసిన సైరా నరసింహా రెడ్డి ఓవర్ బిజినెస్ వలన హిట్ టాక్ తో కూడా ఓవరాల్ గా హిట్ గీతని అందుకోలేక ఫ్లాఫ్ అయింది.
ఆ తర్వాత చేసిన ఆచార్య సినిమా ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది. తర్వాత చేసిన గాడ్ ఫాదర్ సినిమా మంచి టాక్ తో కూడా ఫ్యాన్స్ ని తప్పితే కామన్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించ లేక ఆ సినిమా కూడా నిరాశ పరిచింది.
ఇలాంటి టైంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా 88 కోట్ల బిజినెస్ ను అందుకోవడంతో ఆచార్య మరియు గాడ్ ఫాదర్ రిజల్ట్ లతో వాల్తేరు వీరయ్య టార్గెట్ ను అందుకుంటుందో లేదో అన్న డౌట్స్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయినా…. వాటినన్నింటినీ పటాపంచలు చేస్తూ మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమా…
సంక్రాంతి రేసులో ఊహకందని కలెక్షన్స్ తో కేవలం 6 రోజుల్లోనే టార్గెట్ ను అందుకుని క్లీన్ హిట్ గా నిలిచి 6 ఏళ్ల తర్వాత మెగాస్టార్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు. 2 సార్లు కమర్షియల్ మూవీస్ తోనే హిట్స్ కొట్టాడు మెగాస్టార్… మిగిలిన 3 సినిమాలు సీరియస్ కథలతో సాగే సినిమాలు కాగా ఆడియన్స్ మెగాస్టార్ నుండి ఇప్పటికీ కమర్షియల్ మూవీస్ నే ఇష్టపడుతున్నారు అని వాల్తేరు వీరయ్య సక్సెస్ నిరూపించింది.
Really, The movie was amzing and in this movie megastar comedy timing was excellent