బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి అంచనాలను ఏమాత్రం అందుకోలేక పోయిన సినిమాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్ ల క్రేజీ కాంబోలో భారీ లెవల్ లో తెరకెక్కిన బిగ్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్(Game Changer) సంక్రాంతికి భారీ లెవల్ లో రాగా…
మొదటి రోజు నుండే కలెక్షన్స్ పరంగా మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించ లేక పోయిన సినిమా చాలా త్వరగానే బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకోగా టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్స్ లో ఒకటిగా నిలిచి ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది…
సినిమా ఎప్పటి నుండో షూటింగ్ ను జరుపుకున్న సినిమా చాలా డిలే అవుతూ రాగా ఎట్టకేలకు ఈ ఇయర్ వచ్చిన ఈ సినిమా షూటింగ్ కోసం చాలా ఖర్చు చేశారు అన్న అపవాదు ఉంది. శంకర్ గ్రాండియర్ కి పెట్టింది పేరు అవ్వడంతో ఖర్చుకి ఏమాత్రం వెనకాడలేదు…
దాంతో సినిమా ఫూటేజ్ పెరిగి పోతూ సాగగా ఓవరాల్ గా సినిమా రఫ్ రన్ టైం ఆల్ మోస్ట్ ఏడున్నర గంటల పాటు వచ్చిందని సినిమా ఎడిటర్ షమీర్ మహమ్మద్ కన్ఫాం చేశారు. ముందు సినిమాకి ఎడిటర్ గా ఈయన పని చేయగా తర్వాత ఈయన ప్లేస్ లో రూబెన్ ని ఎడిటర్ గా తీసుకున్నారు..
ఓవరాల్ గా సినిమా ఏడున్నర గంటల రన్ టైం నుండి 3 గంటల రన్ టైంకి తగ్గించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది అని తెలియజేశారు. కానీ ఈ రేంజ్ లో ఫూటేజ్ ను తీయడం బడ్జెట్ మొత్తం ఓవర్ గా పెరిగిపోవడం లాంటివి నిర్మాతకి తీవ్రంగా నష్టాన్ని కలిగించాయి..
బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ డిసాస్టర్ గా నిలిచిన గేమ్ చేంజర్ ఇప్పుడు రన్ టైం పరంగా కూడా ఈ రేంజ్ లో ఫుటేజ్ ను వృదా చేశారు అన్న అపవాదు కూడా మోయాల్సి వచ్చింది…ఓవరాల్ గా సినిమా ద్వారా దిల్ రాజు భారీ నష్టాలనే సొంతం చేసుకోవాల్సి వచ్చిందని సమాచారం…