నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి మొదటి వారాన్ని ఇప్పుడు పూర్తీ చేసుకుంది. సినిమా వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది కానీ తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి సినిమా టాక్ ఉన్న పాజిటివ్ రేంజ్ కి తగ్గట్లు కలెక్షన్స్ ని అయితే సొంతం చేసుకోలేక పోయింది అనే చెప్పాలి. సినిమా మొత్తం మీద…
బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 31 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది, ఇక సినిమా ఓవర్సీస్ లో మొత్తం మీద 700K మార్క్ ని అందుకోగా ఇంకా అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ కోసం కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.
ఇక తెలుగు రాష్ట్రాలలో సినిమాను ఉన్న పరిస్థితుల వలన బిజినెస్ ను కొంచం తగ్గించి మొత్తం మీద అన్నీ కలుపుకుని 22 కోట్ల రేంజ్ లో అమ్మగా సినిమా 22.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద మొదటి వారం పూర్తీ అయిన తర్వాత సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 7.60Cr(inc GST)
👉Ceeded: 2.01Cr
👉UA: 1.70Cr
👉East: 80L
👉West: 64L
👉Guntur: 94L
👉Krishna: 73L
👉Nellore: 50L
AP-TG Total:- 14.92CR(25.28CR~ Gross)
Ka+ROI: 2.50Cr
OS – 3.38Cr
Total WW: 20.80CR(36.82CR~ Gross)
ఇదీ మొత్తం మీద శ్యామ్ సింగ రాయ్ టోటల్ గా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ లెక్క.
22.5 కోట్ల రేంజ్ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా మొదటి వారం తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా 1.70 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. సినిమా రెండో వారం భారీగానే థియేటర్స్ ని హోల్డ్ చేస్తుంది కాబట్టి కచ్చితంగా రెండో వారం మినిమమ్ హోల్డ్ చేసినా ఈ కలెక్షన్స్ ని అందుకుని బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుంటుంది.