బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ది వారియర్ రిలీజ్ అయ్యి మొదటి వారాన్ని పూర్తీ చేసుకుంది. సినిమా మొదటి రోజే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకోగా వీకెండ్ వరకు ఉన్నంతలో పర్వాలేదు అనిపించే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా వర్కింగ్ డేస్ లో టికెట్ రేట్స్ ని తగ్గించి ఉంటే హోల్డ్ కొంచం బెటర్ గా ఉండేదేమో కానీ సినిమా….
టికెట్ రేట్స్ ని తగ్గించక పోవడంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా స్లో డౌన్ అయింది సినిమా. దాంతో ఇక అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే వర్కింగ్ డేస్ లో స్లో అయిన తీరు కలెక్షన్స్ టార్గెట్ కి చాలా దూరంలో ఆగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.
మొత్తం మీద సినిమా 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 42 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 59 లక్షల రేంజ్ లో షేర్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది. ఇక టోటల్ గా మొదటి వారానికి గాను సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 5.44Cr
👉Ceeded: 2.88Cr
👉UA: 2.27Cr
👉East: 1.26Cr
👉West: 1.12Cr
👉Guntur: 1.87Cr
👉Krishna: 90L
👉Nellore: 61L
AP-TG Total:- 16.35CR(25.20Cr~ Gross)
👉KA+ ROI: 95L
👉OS: 62L
👉Tamil – 1.10Cr~ est
Total World Wide: 19.02CR (32.20CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా మొదటి వారంలో ఓవరాల్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క ఇది…
మొత్తం మీద సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 39 కోట్లు కాగా సినిమా మొదటి వారం సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 19.98 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక రెండో వారంలో సినిమా ఎలాంటి హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి ఇక…