ప్రతీ సినిమా ఆడియన్స్ ముందుకు రావడం జరగదు, కొన్ని సినిమాలు షూటింగ్ మధ్యలోనే ఆగిపోతాయి, కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తీ అయిన తర్వాత ఆగిపోతాయి, కొన్ని అన్ని పనులు పూర్తీ చేసుకుని కొనేవాళ్ళు లేక ఆగిపోతాయి, కొన్ని పూర్తీ అయిన తర్వాత క్వాలిటీ నచ్చక ఆగిపోతాయి, ఇక కొన్ని ఫైనాన్స్ లేక ఇతర విభేదాల కారణంగా రిలీజ్ జరగక ఆగిపోతూ ఉంటాయి, ఈ కోవలో కొన్ని క్రేజ్ ఉన్న సినిమాలు కూడా ఇబ్బంది పడ్డాయి..
చిన్న హీరోల్లో అప్పట్లో ఒక సాంగ్ తో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న సినిమా ఒకటుంది. సందీప్ కిషన్ కాజల్ అగర్వాల్ సిస్టర్ నిషా అగర్వాల్ కలిసి నటించిన DK బోస్… నే పడి పోయా… పడిపోయా అనే సాంగ్ తో మంచి హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా…
2013 లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. టీసర్ ట్రైలర్ కూడా మంచి హైప్ నే సొంతం చేసుకోగా గబ్బర్ సింగ్ తరహా రా రస్టిక్ పోలిస్ రోల్ లో సందీప్ కిషన్ నటించిన ఈ సినిమా ఆ ఏడాది రిలీజ్ అవ్వకుండా వరుస పెట్టి పోస్ట్ పోన్ అవుతూ అసలు ఎవరికీ గుర్తు లేకుండా పోయింది.
కట్ చేస్తే దాదాపు ఏడేళ్ళ తర్వాత ఇప్పుడు తిరిగి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది, అది థియేటర్స్ లో కాదు, డైరెక్ట్ స్ట్రీమింగ్ యాప్స్ లో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంటే కమర్షియల్ గా సందీప్ కిషన్ కెరీర్ కి హెల్ప్ అయి ఉండేది కానీ..
కొన్ని అనుకోని కారణాల వల్ల రిలీజ్ ఆగిపోయిన ఈ సినిమా ఇప్పుడు డైరెక్ట్ OTT లో రిలీజ్ అవ్వబోతుంది, త్వరలోనే డేట్ ని అనౌన్స్ చేస్తారని సమాచారం. అలాగే ఎందులో రిలీజ్ అవ్వబోతుందో కూడా కన్ఫాం చేస్తారు. మరి స్ట్రీమింగ్ యాప్ లో రిలీజ్ అయ్యే ఈ సినిమా హీరో కెరీర్ కి ఎంతవరకు ఉపయోగ పడుతుందో చూడాలి…