బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్య ల లేటెస్ట్ మూవీ బంగార్రాజు మొదటి వారాన్ని ఘనంగా పూర్తీ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ కాకపోవడంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన బంగార్రాజు మొదటి వారం మొత్తం మీద 700 వరకు థియేటర్స్ లో పరుగును సాలిడ్ గా కొనసాగించింది. ఇక ఇప్పుడు రెండో వారంలో…
అడుగు పెట్టిన ఈ సినిమా ఎన్ని థియేటర్స్ ని హోల్డ్ చేసింది అన్నది ఆసక్తిగా మారగా సినిమా ఎక్స్ లెంట్ హోల్డ్ ని సొంతం చేసుకుంది, నైజాంలో 220 థియేటర్స్ ని హోల్డ్ చేసిన ఈ సినిమా సీడెడ్ లో 115 థియేటర్స్ ని హోల్డ్ చేయగా టోటల్ ఆంధ్రలో 300 థియేటర్స్ ని హోల్డ్ చేసింది…
దాంతో మొత్తం మీద 2వ వారంలో రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 635 థియేటర్స్ ని హోల్డ్ చేసి కేవలం 65 థియేటర్స్ ని మాత్రమే డ్రాప్ అయింది. ఇది ఎక్స్ లెంట్ హోల్డ్ అని చెప్పాలి. అదే టైం లో సినిమా నైజాంలో కలెక్షన్స్ పరంగా ఇంకా చాలా వెనక బడి ఉండగా ఓవరాల్ గా రెండో వారంలో బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది…