పాన్ ఇండియా సెన్సేషన్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ సినిమా రీసెంట్ గా భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా పర్వాలేదు అనిపించే రేంజ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ సోషల్ మీడియా లో మాత్రం టాక్ మిక్సుడ్ గా ఉండటం అది అన్ని చోట్లా స్ప్రెడ్ అయింది, ఇక తెలుగు రాష్ట్రాలలో సినిమా రిలీజ్ కౌంట్ రీసెంట్ బిగ్ మూవీస్ కన్నా కొంచం తక్కువగా…
ఉన్నా కానీ ఆంధ్రలో టికెట్ హైక్స్ ఎక్స్ ట్రా గా కూడా పెంచడంతో కలెక్షన్స్ పరంగా మాత్రం ఇది ఓపెనింగ్స్ సాలిడ్ గా సొంతం అయ్యే అవకాశం కల్పిస్తుంది అని చెప్పొచ్చు. ఇక మొదటి రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 36 కోట్ల నుండి 38 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని…
సొంతం చేసుకునేలా ఉండగా సినిమా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 40 కోట్ల మార్క్ ని అందుకునే ఔట్ రైట్ ఛాన్స్ ఉంది, ఇక సినిమా హిందీ లో మొత్తం మీద బుకింగ్స్ లెక్కల ప్రకారం 8-10 కోట్ల మధ్యలో గ్రాస్ రావొచ్చని అంచనా వేస్తుండగా….
మిగిలిన చోట్ల ఇండియా లో మొత్తం మీద సినిమా మరో 8-10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పాలి. దాంతో ఇండియా లో సినిమా మొదటి రోజు మొత్తం మీద 55 కోట్ల నుండి 60 కోట్ల మధ్యలో గ్రాస్ ని అందుకునేలా ఉండగా ఓవర్సీస్ లో 10 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండటంతో 70 కోట్ల రేంజ్ గ్రాస్ ని అందుకునే అవకాశం ఉంది… ఇవి ఓవరాల్ ఫస్ట్ డే అంచనాలు కాగా…
అఫీషియల్ ఫస్ట్ డే గ్రాస్ లెక్క ఎంతవరకు వెళుతుందో చూడాలి ఇక… కానీ ప్రభాస్ ప్రీవియస్ మూవీస్ రేంజ్ లో 100 కోట్ల రేంజ్ లో గ్రాస్ తో దుమ్ము దుమారం లేపుతుంది అనుకున్న రాధే శ్యామ్ ఆ రేంజ్ లో అందుకునే అవకాశం అయితే కనిపించడం లేదు… అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఊహకందని రేంజ్ లో ఉండే కూడా ఆ మార్క్ దరిదాపుల్లోకి వెళ్ళడం కష్టమే అని చెప్పాలి. ఇక అఫీషియల్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.