రిలీజ్ అయిన రోజు నుండి అంచనాలను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోయిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) మొత్తం మీద 8 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 221.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకోగా…
వరల్డ్ వైడ్ గా సినిమా 694 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది. ఇక సినిమా 9వ రోజు నార్మల్ శుక్రవారం అయినా కూడా అన్ని చోట్లా అద్బుతంగా హోల్డ్ ని మరోసారి చూపించి దుమ్ము లేపడం ఇప్పుడు విశేషం అని చెప్పాలి…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా 7.5-8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోబోతుండగా హిందీలో 12 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 9వ రోజున సొంతం చేసుకోబోతుంది. ఇక కర్ణాటక, తమిళ్ మరియు కేరళ కలిపి 3.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకునే అవకాశం ఉండగా టోటల్ గా ఇండియా లోనే సినిమా ఇప్పుడు…
23 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోబోతుంది. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా 28 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉన్న సినిమా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ అంచనాలను సైతం మించే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.
దాంతో టోటల్ గా 9 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 229 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా మమ్మోత్ 722 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. నార్మల్ వర్కింగ్ డే రిలీజ్ తో ఇలాంటి వసూళ్ళని సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఇలానే జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉండటంతో వీకెండ్ అయ్యే లోపు గ్రాస్ లెక్క మరింత సాలిడ్ గా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక మొత్తం మీద సినిమా 9 రోజుల్లో సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.