Home న్యూస్ 72 గంటలు నాన్ స్టాప్ రచ్చ…బాలయ్య సడెన్ గా వచ్చినా దుమ్ము లేపాడు!!

72 గంటలు నాన్ స్టాప్ రచ్చ…బాలయ్య సడెన్ గా వచ్చినా దుమ్ము లేపాడు!!

1348
0

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక బాలయ్య బోయపాటి ల కాంబో లో వచ్చిన సింహా లెజెండ్ సినిమాల తర్వాత వస్తున్న హాట్రిక్ మూవీ అవ్వడం తో అంచనాలు మరింత ఎక్కువగా ఉన్న ఈ సినిమా అఫీషియల్ టైటిల్ అనౌన్స్ మెంట్ ను రీసెంట్ గా ఉగాది కానుకగా…

ఒక కొత్త టీసర్ గ్లిమ్స్ లో రిలీజ్ చేశారు. సినిమాలో సెకెండ్ రోల్ తాలూకు లుక్ ని కూడా రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన ఈ టీసర్ సెన్సేషనల్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది, బాలయ్య లుక్ అడిరిపోగా, విజువల్స్ అండ్ టేకింగ్ అద్బుతంగా ఉండటం తో…

ఇన్స్టంట్ గా ఫుల్ హైప్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది, ఇక టీసర్ మొదటి 24 గంటల్లో సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ 7.35 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోగా రెండో రోజు కూడా 6 మిలియన్స్ దాకా వ్యూస్ ని సొంతం చేసుకుని రచ్చ చేసింది.

ఇక రిలీజ్ అయిన రోజు సాయంత్రం టైం లో టాప్…. ప్లేస్ లో ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టిన ఈ టీసర్ నాన్ స్టాప్ గా 3 రోజులు అంటే 72 గంటల పాటు ట్రెండ్ అవుతూ దూసుకు పోతుంది, ఇంకా టాప్ ప్లేస్ లోనే ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం అనే చెప్పాలి. ఈ రేంజ్ లో రచ్చ చేసిన ఈ టీసర్ సినిమా పై ఉన్న అంచనాలను…

మరింతగా పెంచేసింది అని చెప్పాలి. ఇక 3 లక్షల లైక్స్ ను కూడా క్రాస్ చేసిన ఈ టీసర్ 18 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతూ ఉండటం విశేషం. ఇక మెయిన్ టీసర్ ట్రైలర్ లు కూడా ఇదే రేంజ్ లో రచ్చ చేస్తే… సింహా లెజెండ్ సినిమాలను మించే రేంజ్ రచ్చ అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here