బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 2 రోజుల్లో కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush) కుబేర(Kuberaa Movie) సినిమా తెలుగు రాష్ట్రాల్లో రిమార్కబుల్ ట్రెండ్ ను చూపించి ఏకంగా 24.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా కూడా అంచనాలను మించి దుమ్ము లేపిన సినిమా 52 కోట్లకు పైగా…
గ్రాస్ మార్క్ ని అందుకుని ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపించింది. ఇక సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో మరోసారి డబుల్ డిజిట్ గ్రాస్ మార్క్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే లెక్క ఇంకా పెరగవచ్చు…
ఇక తమిళనాడులో సినిమా ఈ రోజు 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో మొత్తం మీద 3 కోట్లు ఆ పైన గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. దాంతో టోటల్ గా సినిమా 3వ రోజున ఇండియాలో 17-18 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను…
సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ లో కూడా మంచి జోరుని చూపిస్తున్న 3వ రోజున వరల్డ్ వైడ్ గా 21 కోట్ల రేంజ్ నుండి 22 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మరోసారి అందుకునే అవకాశం మించి పోయే ఔట్ రైట్ ఛాన్స్ ఉండగా ఈ రోజు కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు…
మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 35 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా, వరల్డ్ వైడ్ గా సినిమా 73-74 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
ఓవరాల్ గా వీకెండ్ లో సినిమా ఒక్క తమిళనాడులో తప్పితే మిగిలిన అన్ని చోట్లా అంచనాలను మించి పెర్ఫార్మ్ చేసింది. ఇక సినిమా వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ కాబోతుంది కాబట్టి ఎలాంటి హోల్డ్ ని చూపెడుతుందో అన్న దాని మీద లాంగ్ రన్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పొచ్చు.