బాక్స్ ఆఫీస్ దగ్గర లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ విక్రమ్ మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 1.96 కోట్ల షేర్ ని అందుకోగా రెండో రోజు కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించిన సినిమా ఆల్ మోస్ట్ 15% లోపు డ్రాప్స్ ని సొంతం చేసుకోగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా….
సాలిడ్ గానే ఉండటంతో తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు 1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ ని అందుకోవచ్చు. ఇక తమిళనాడులో రెండో రోజు కూడా 18 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే…
అవకాశం ఉండగా రెండో రోజు వరల్డ్ వైడ్ గా 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది… దాంతో 2 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 75 కోట్ల కి పైగా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే ఫైనల్ కలెక్షన్స్ లెక్క 80 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్పాలి. ఇక టోటల్ 2 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.