ఆల్ మోస్ట్ 5 ఏళ్ళుగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న యూత్ స్టార్ నితిన్(Nithiin) నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్(RobinHood Movie) సినిమాతో ఆ కంబ్యాక్ సొంతం అవుతుంది అనుకున్నా కూడా అలాంటిది ఏమి జరగలేదు. మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించ లేక పోయిన…
ఈ సినిమా జరిగిన వాల్యూ బిజినెస్ అండ్ పెట్టిన బడ్జెట్ దృశ్యా చూసుకుంటే భారీ నష్టాలను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. సినిమా ప్రమోషన్స్ ఖర్చులతో కలిపి ఓవరాల్ గా 75 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ బడ్జెట్ కి…
మినిమమ్ న్యాయం కూడా చేయలేక పోతూ అందులో 10% రికవరీని కూడా ఇప్పటి వరకు అందుకోలేక పోయింది. సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ను రిలీజ్ కి ముందే జీ నెట్ వర్క్ కి డీసెంట్ రేటుకి అమ్మడంతో కొంచం నష్టాలు తగ్గాయని అన్న టాక్ ఉన్నప్పటికీ కూడా…
ఓవరాల్ గా ఆ రేటు రేంజ్ 30 కోట్ల లెవల్ లో అన్నీ కలిపి ఉంటాయని సమాచారం. ఇక వాల్యూ బిజినెస్ కాకుండానే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 45-50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే మేకర్స్ సేఫ్ అయ్యే అవకాశం ఉండేది కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
మినిమమ్ ఇంపాక్ట్ కూడా చూపించ లేక పోతూ ఉండటంతో మేకర్స్ కి పెట్టిన డబ్బులో సగం వరకు నష్టం కచ్చితంగా రావడం ఖాయంగా కనిపిస్తుందని సమాచారం. ఈ సినిమాతో కంబ్యాక్ ఎక్స్ పెర్ట్ చేసిన నితిన్ కి హట్రిక్ ఎక్స్ పెర్ట్ చేసిన వెంకి కొడుముల కి గట్టి ఎదురుదెబ్బ కొట్టింది ఈ సినిమా రిజల్ట్….