బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెంటాస్టిక్ కలెక్షన్స్ తో ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా, మొదటి వీక్ లో అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని వీర లెవల్ లో కుమ్మేసింది. ఇక రెండో వీక్ లో రిలీజ్ అయిన సినిమాల పరిస్థితిని చూస్తుంటే…
తండేల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ నెల ఎండ్ వరకు కూడా మంచి జోరునే చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా నాగ చైతన్య కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని షేర్ రూపంలో అలాగే గ్రాస్ రూపంలో సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన విషయం తెలిసిందే…
ఇక ఇప్పుడు కొత్త బెంచ్ మార్క్ లను కూడా నమోదు చేస్తూ రచ్చ చేస్తున్న సినిమా ఇప్పుడు నాగ చైతన్య కెరీర్ లో మొట్ట మొదటి 75 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమాగా మాస్ రచ్చ చేయడం విశేషం. మేకర్స్ లెక్కల్లో ఆల్ రెడీ 90 కోట్ల మార్క్ ని దాటింది అంటూ పబ్లిసిటీ పోస్టర్ లు రిలీజ్ చేసినా..
ట్రేడ్ లెక్కల్లో మాత్రం సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 43 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా 75 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా దూసుకు పోతూ ఉండగా ఈ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి జోరు పెంచే అవకాశం ఉండగా….
లాంగ్ రన్ లో నాగ చైతన్య కెరీర్ లో మరిన్ని కొత్త బెంచ్ మార్క్ లను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. 2 బాక్ టు బాక్ డిసాస్టర్స్ తో కెరీర్ లో భారీగా స్లో అయిన నాగ చైతన్య కెరీర్ కి ఇప్పుడు తండేల్ మూవీ మాస్ బూస్టప్ ఇచ్చి తన కెరీర్ లో ఎపిక్ రికార్డులతో దూసుకు పోతూ ఉండటం విశేషం….