బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(Adi Purush) మూవీ భారీ లెవల్ లో ఈ శుక్రవారం రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద ఆడియన్స్ లో అంచనాలు రోజు రోజుకి పెరిగి పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి.
ప్రభాస్(Prabhas) పెద్దగా ప్రమోషన్స్ ఏమి చేయక పోయినా కూడా ఆదిపురుష్ మూవీ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో దూసుకు పోతుంది. ప్రభాస్ లాస్ట్ మూవీ రాధే శ్యామ్ మిగిలిన చోట్ల పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు.
అయినా కానీ ఇప్పుడు ఆది పురుష్ మూవీకి మిగిలిన చోట్ల రిలీజ్ కి ఇంకా 3 రోజుల టైం ఉండగానే ఆల్ ఓవర్ ఇండియాలో అడ్వాన్స్ టికెట్ సేల్స్ ద్వారా ఆల్ మోస్ట్ 7 కోట్ల దాకా గ్రాస్ బుకింగ్స్ జరగడం విశేషం అని చెప్పాలి. ఇక్కడ బిగ్గెస్ట్ సర్ ప్రైజ్ ఏంటంటే…
మేజర్ కలెక్షన్స్ వచ్చే తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు… తెలుగు రాష్ట్రాలు కాకుండానే సినిమా హిందీ వర్షన్ 4 కోట్లు, తెలుగు వర్షన్ తో పాటు మిగిలిన వర్షన్ లు మరో 3 కోట్ల దాకా గ్రాస్ బుకింగ్స్ ను ఇండియాలో సొంతం చేసుకుని దుమ్ము లేపుతుంది.
ఇక తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ కూడా ఓపెన్ అయితే ఇంకా రచ్చ పెరిగి పోవడం ఖాయమని చెప్పాలి. చూస్తుంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా వన్ ఆఫ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉండనిపించేలా జోరు చూపిస్తుంది.