బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో వచ్చిన మల్టీ స్టారర్ మూవీ ఆచార్య మొదటి వారాన్ని పూర్తీ చేసుకునే పనిలో ఉండగా సినిమా 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తుంది. సినిమా 6వ రోజు తో పోల్చితే ఆల్ మోస్ట్ 30% వరకు డ్రాప్స్ ను అందుకోగా….
ఈవినింగ్ అండ్ నైట్ షోల కి కూడా పెద్దగా గ్రోత్ ఏమి కూడా కనిపించడం లేదు. దాంతో ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో సినిమా 15 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇది నిజంగానే దారుణమైన కలెక్షన్స్ అని చెప్పాలి ఓవరాల్ గా…
ఈ రేంజ్ లో అతి తక్కువ కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తున్న ఆచార్య సినిమా ఇక తేరుకునే అవకాశం లేదనే చెప్పాలి. చాలా చోట్లా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తుంది. ఇక మొత్తం మీద మొదటి వారానికి గాను సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.