నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీనుల కాంబో మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి ఎక్స్ టెండెడ్ 4 డేస్ వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయ్యి కలెక్షన్స్ పరంగా మంచి అంచనాలను మించిపోకున్నా కానీ ఉన్నంతలో మంచి హోల్డ్ నే సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా ఇప్పుడు 7 వ రోజు లో ఎంటర్ అయిన సినిమా…
మరోసారి పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తుంది. సినిమా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు 6 వ రోజు తో పోల్చితే మరోసారి 20-25% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొద్ది వరకు బుకింగ్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి అని చెప్పాలి.
ఇక సినిమా మొత్తం మీద ఈవినింగ్ అండ్ నైట్ షోలలో గ్రోత్ ని చూపెట్టగలిగితే 7 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 1.6 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 1.8 కోట్ల మార్క్ ని అందుకునే ఛాన్స్ ఉంది. మరి డే ఎండ్ అయ్యే టైం కి సినిమా ఇంకా ఎంత దూరం వెల్లగలుగుతుందో చూడాలి.