బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న బింబిసార మరియు సీతా రామం సినిమాలు ఇప్పుడు ఘనంగా మొదటి వారాన్ని పూర్తీ చేసుకునే పనిలో ఉన్నాయి. రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకోగా బింబిసార ఎక్స్ లెంట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక ఈ రెండు సినిమాలు 7వ రోజు…
తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేశాయి అని చెప్పాలి. బింబిసార కొంచం డ్రాప్స్ ను ఎక్కువగానే సొంతం చేసుకుంది, అదే సమయంలో సీతా రామం లిమిటెడ్ డ్రాప్స్ తో పరుగును కొనసాగిస్తుంది. మొత్తం మీద బింబిసార 35-40% రేంజ్ లో డ్రాప్ అవ్వగా అదే టైం లో…
సీతా రామం సినిమా 20-25% లోపు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. దాంతో ఈ రోజు బింబిసార తెలుగు రాష్ట్రాల్లో 60 లక్షలకు అటూ ఇటూగా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా సీతారామం సినిమా మొత్తం మీద 60-65 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది.
మొత్తం మీద 2 సినిమాల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా బింబిసార 70-75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా సీతారామం ఈ రోజు వరల్డ్ వైడ్ గా సూపర్ లీడ్ తో 1.2 కోట్ల కి అటూ ఇటూగా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది.
మొత్తం మీద ఇప్పుడు సీతా రామం ఆల్ మోస్ట్ బింబిసార సినిమాను డామినేట్ చేస్తూ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది, కానీ అదే టైం లో బింబిసార ఆల్ రెడీ సెన్సేషనల్ ప్రాఫిట్స్ తో దుమ్ము లేపే విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక రెండు సినిమాల అఫీషియల్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ లెక్క ఏ విధంగా ఉంటుందో చూడాలి.