బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో ఎలాగోలా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న రాధే శ్యామ్ సినిమా వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం భారీ గా స్లో డౌన్ అయింది… సినిమా కి మరీ నెగటివ్ టాక్ రాలేదు కానీ ఎందుకనో జనాలు అస్సలు థియేటర్స్ కి రావడం లేదు ఈ సినిమా విషయంలో వర్కింగ్ డేస్ లో… దాంతో అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ డ్రాప్స్ ను సొంతం చేసుకుని…
ఇప్పుడు టాలీవుడ్ చరిత్ర లోనే కాదు ఇండియన్ సినిమా హిస్టరీ లో కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాస్ ని సొంతం చేసుకున్న సినిమాగా ఈ సినిమా నిలవబోతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ఇప్పుడు 7 వ రోజు మరో సారి 30-35% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకోగా…
మొత్తం మీద 35 లక్షల నుండి 40 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక హిందీ లో ఈ రోజు సినిమా 60 లక్షల నుండి 70 లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు… కొండంత టార్గెట్ ని అందుకోవాల్సిన రాధే శ్యామ్ ఇక ఆ మార్క్ దరిదాపుల్లోకి కాదు కదా సగం కూడా అందుకునే అవకాశం కనిపించడం లేదు ఇప్పుడు.