Home న్యూస్ 2.0 డే 7 కలెక్షన్స్….ఇక కష్టమే!

2.0 డే 7 కలెక్షన్స్….ఇక కష్టమే!

0

  సూపర్ స్టార్ రజినీకాంత్ అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అయ్యి 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 456 కోట్ల గ్రాస్ ని వసూల్ చేసింది. కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజు మరింతగా స్లో డౌన్ అయింది. ముఖ్యంగా తెలుగు వర్షన్ కలెక్షన్స్ కానీ తమిళ్ వర్షన్ కలెక్షన్స్ కానీ ఏమాత్రం జోరు చూపలేదు.

కానీ హిందీ వర్షన్ మాత్రమె అనుకున్న రేంజ్ లో జోరు చూపుతూ పాజిటివ్ టాక్ పవర్ తో దూసుకు పోతుంది. ఓవరాల్ గా 7 వ రోజు సినిమా ఇండియా లో 20 కోట్లకు పైగా గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా 25 కోట్ల రేంజ్ కి పైగా గ్రాస్ ని అందుకునే చాన్స్ ఉందని అంటున్నారు.

సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఈ జోరు ఏమాత్రం సరిపోదనే చెప్పాలి. ఇంకాస్త జోరు చూపి సెకెండ్ సీకేండ్ లో సినిమా మళ్ళీ హ్యూజ్ గ్రోత్ ని సాధిస్తేనే బాక్స్ ఆఫీస్ దగ్గర నెట్టుకు రాగలదు. లేకపోతె అనుకున్న టార్గెట్ ని అందుకోవడం కష్టమే అని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here