మమ్మోత్ ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ గా హోల్డ్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తుంది కానీ 6 వ రోజు మాత్రం ఓవరాల్ గా అనుకున్న దాని కన్నా కూడా కలెక్షన్స్ తగ్గాయి, ప్రతీ రోజు అనుకున్న అంచనాల కన్నా ఎక్కువ వసూళ్లు సాధించిన ఈ సినిమా 6 వ రోజు అంచనాలను అందుకోలేదు. ఇక ఇప్పుడు 7 వ రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ లో…
ఎంటర్ అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకుంది… కాగా 5 వ రోజు నుండి 6 వ రోజుకి ఆల్ మోస్ట్ 30% వరకు డ్రాప్ అయిన సినిమా ఇప్పుడు 7 వ రోజు ఓపెనింగ్స్ పరంగా కూడా 30% వరకు డ్రాప్స్ కనిపిస్తూ ఉన్నాయి తెలుగు రాష్ట్రాలలో…
ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ పర్వాలేదు అనిపించే విధంగా కొనసాగుతూ ఉండగా ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే… 6.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా ఓవరాల్ గా సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది.. ఇక సినిమా హిందీ లో మరోసారి…
ఎక్స్ లెంట్ హోల్డ్ ని సొంతం చేసుకోగా ఈ రోజు హిందీ లో సినిమా 11 కోట్ల నుండి 11.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది, ఇక కర్ణాటక అండ్ తమిళనాడులో ఈ రోజు ఓవరాల్ గా 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఓవరాల్ గా సినిమా ఇప్పుడు 7 వ రోజు వరల్డ్ వైడ్ గా…
17 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. కానీ 19-20 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటే వీకెండ్ గట్టి రాంపేజ్ కి బాటలు వేసినట్లు అవుతుంది, మరి సినిమా డే ఎండ్ అయ్యే టైం కి గ్రోత్ చూపించి ఈ టార్గెట్ ను అందుకుంటుందో లేదో చూడాలి ఇక… డే ఎండ్ అయ్యే టైం కి మరో ఆర్టికల్ కలెక్షన్స్ ని అప్ డేట్ చేస్తాం.