మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్స్ ని రెండు తెలుగు రాష్ట్రాల లో సాధిస్తుంది, సినిమా 6 రోజుల్లో టోటల్ గా 104.79 కోట్ల షేర్ ని అందు కుని సంచలనం సృష్టించ గా సినిమా ఇప్పుడు 7 వ రోజు లో ఎంటర్ అయ్యింది. కాగా ఈ రోజు దసరా హాలిడే అవ్వడం తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ ట్రెండ్ ని కొనసాగిస్తుంది.
సినిమా 6 వ రోజు తో పోల్చితే 7 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రెండు షోలకు ఆల్ మోస్ట్ 5% వరకు గ్రోత్ ని ఇప్పటికే అందుకుని మంచి ట్రెండ్ ని కొనసాగిస్తుంది. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మంచి జోరుగా…
సాగుతున్నాయి…. దాంతో రోజు మొత్తం అల్టిమేట్ గ్రోత్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం గట్టిగా కనిపిస్తుంది, ఈవినింగ్ అండ్ నైట్ షోలకు గ్రోత్ భారీ గా కంటిన్యు అయ్యేలా ఉండటం తో సినిమా ఈ రోజు అవలీలగా మినిమం 6 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ బరిలో సాధించే అవకాశం ఉంది.
ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఎలాగూ ఫుల్ జోరు గా ఉండే అవకాశం ఉండటం తో ఈ రోజు ఫైనల్ లెక్క ఎలా ఉంటుంది అన్నది ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి గానీ క్లియర్ గా చెప్పలేమ్. ఇక సినిమా తెలుగు రాష్ట్రాలలో మంచి జోరు చూపుతున్నా కానీ..
మిగిలిన చోట్లలో ఒక్క కర్ణాటక తప్పితే అన్ని చోట్లా ఏమాత్రం ఇంపాక్ట్ చూపడం లేదు. దాంతో తెలుగు రాష్ట్రాల పై డబుల్ ప్రెజర్ పడుతుంది అని చెప్పాలి. సినిమా రానున్న రోజుల్లో కూడా స్ట్రాంగ్ కలెక్షన్స్ ని అందుకుంటేనే ఇతర రాష్ట్రాల నష్టాలను పూడ్చే అవకాశం ఉంటుంది. ఇక రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూసి అప్ డేట్ చేస్తాం.