బాక్స్ ఆఫీస్ దగ్గర PRABHAS నటించిన లేటెస్ట్ మూవీ Adi Purush మొదటి వారాన్ని పూర్తీ చేసుకునే పనిలో ఉండగా సినిమా వీకెండ్ లో ఎక్స్ లెంట్ వసూళ్ళతో దుమ్ము దుమారం లేపిన సినిమా వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం హెవీ డ్రాప్స్ నే సొంతం చేసుకుందని చెప్పాలి.
ఇక సినిమా 7వరోజు మరో వర్కింగ్ డే టెస్ట్ లోకి ఎంటర్ అయిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 30-35% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా హిందీలో కూడా 35% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. దాంతో సినిమా ముందు అనుకున్నట్లే తెలుగు రాష్ట్రాల్లో…
అటూ ఇటూగా 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా హిందీలో 2.5 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. సినిమా 7వ రోజు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఇప్పుడు అటూ ఇటూగా 3 కోట్ల నుండి 3.2 కోట్ల రేంజ్ లో…
షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా అయితే ఈ కలెక్షన్స్ అసలు ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద మొదటి వీకెండ్ లో దుమ్ము లేపిన తర్వాత సినిమా వర్కింగ్ డేస్ లో…
కంప్లీట్ గా స్లో డౌన్ అయింది అనే చెప్పాలి. ఇక రెండో వీక్ లో సినిమాకి పెద్దగా పోటి ఏమి లేదు కాబట్టి సినిమా ఎంతో కొంత హోల్డ్ చేస్తుందని అందరూ అనుకుంటున్నారు. మరి సినిమా ఎంతవరకు హోల్డ్ చేస్తుందో చూడాలి. ఇక ఫస్ట్ వీక్ లో అఫీషియల్ గా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.