బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie) పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం పెద్దగా…
ఇంపాక్ట్ ని ఏమి చూపించ లేక పోతూ మొదటి వీక్ వర్కింగ్ డేస్ లో కంటిన్యూగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా ఇప్పుడు మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకో బోతూ ఉండగా 6వ రోజుతో పోల్చితే 7వ రోజున మరోసారి వర్కింగ్ డే లో ఉన్న సినిమా…
6వ రోజుతో పోల్చితే లిమిటెడ్ గానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంటున్నా కూడా, ఓవరాల్ గా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే మాత్రం ఈ హోల్డ్ అసలు ఏమాత్రం సరిపోదు అనే చెప్పాలి. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
7వ రోజున ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే అటూ ఇటూగా 25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే షేర్ లెక్క కొంచం పెరిగే అవకాశం ఉంది.
ఇక వరల్డ్ వైడ్ గా పెద్దగా షేర్ ఏమి వచ్చేలా కనిపించడం లేదు. ఓవరాల్ గా టీం సినిమా బాగా పెర్ఫార్మ్ చేస్తుందని నమ్మకం వ్యక్తం చేసినా కూడా వర్కింగ్ డేస్ లో సినిమా భారీగానే డ్రాప్ అయింది. ఇక ఫస్ట్ వీక్ కి గాను సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి…