రిలీజ్ అయిన వీకెండ్ లో ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన లేటెస్ట్ మూవీ బ్రో ది అవతార్(BRO The Avatar) మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో మాత్రం భారీగా స్లో డౌన్ అయిపోయింది.
రోజు రోజుకి కలెక్షన్స్ లో భారీ డ్రాప్స్ ఉండగా ఇప్పుడు మొదటి వారాన్ని పూర్తి చేసుకునే పనిలో ఉన్న బ్రో మూవీ 7వ రోజున మరో వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అవ్వగా మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్స్ 30-35% వరకు ఉన్నాయని చెప్పాలి ఇప్పుడు…
దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు సినిమా అటూ ఇటూగా 60 లక్షల నుండి 65 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఒకవేళ అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో ఏమైనా గ్రోత్ ఉంటే షేర్ కొంచం పెరిగే అవకాశం ఉంది కానీ చాలా తక్కువ…
ఇక వరల్డ్ వైడ్ గా కూడా ఈ రోజు సినిమా అటూ ఇటూగా 85 లక్షల నుండి 90 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గ్రాస్ 1.5 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు. సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ అసలు…
బ్రేక్ ఈవెన్ ని అందుకోవడానికి ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి ఇప్పుడు. రెండో వీకెండ్ లో ఏమైనా అద్బుతాలు జరిగితే తప్ప సినిమా తిరిగి కోరుకునే అవకాశమే లేక పోవడంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలనే సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక ఫస్ట్ వీక్ టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.