బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ స్టార్ట్ తర్వాత కొంచం స్లో డౌన్ అయినా కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ నే చూపెడుతూ దూసుకు పోతున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా మొదటి వారాన్ని ఇప్పుడు స్ట్రాంగ్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధం అవుతుంది…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర శనివారం అడ్వాంటేజ్ లభించడంతో మంచి జోరునే చూపెడుతుంది కానీ నైజాంలో మాత్రం అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ అయితే చేయలేక పోతుంది…సంక్రాంతికి వస్తున్నాం ఊరమాస్ రాంపెజ్ ముందు ఇక్కడ డాకు మహారాజ్ కూడా స్లో అయింది…
కోస్టల్ ఆంధ్ర మరియి సీడెడ్ లో పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేస్తున్న సినిమా ఆల్ మోస్ట్ 6వ రోజు రేంజ్ కి సిమిలర్ అనిపించే రేంజ్ లో బుకింగ్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా, అన్ని చోట్లా ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే సినిమా 7వ రోజున తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా….
2.6-2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరిగే అవకాశం ఉండగా ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్ లో సినిమా కొంచం డ్రాప్స్ ను మరోసారి సొంతం చేసుకోగా మొత్తం మీద సినిమా ఇప్పుడు…
7వ రోజున వరల్డ్ వైడ్ గా 3-3.1 కోట్ల రేంజ్ నుండి ఆ పైన షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఓవరాల్ గా మరోసారి సినిమా పర్వాలేదు అనిపించేలా జోరు చూపిస్తుంది అని చెప్పాలి. ఇక మొత్తం మీద డాకు మహారాజ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారానికి గాను సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.