బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ దసరా మొదటి వారాన్ని ఘనంగా పూర్తీ చేసుకోవడానికి సిద్ధం అవుతుంది. సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వీకెండ్ ని పూర్తీ చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో కొంచం స్లో అయినా కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తూ దూసుకు పోతున్న దసరా సినిమా ఇప్పుడు 7వ రోజున కూడా…
మరోసారి పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తుంది. 6వ రోజుతో పోల్చితే 7వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 25%-30% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా ఇదే విధంగా డ్రాప్స్ ఉండే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు…
దాంతో సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 1.1 కోట్ల నుండి 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే లెక్క కొంచం పెరగవచ్చు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా అటూ ఇటూగా…
1.6 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే లెక్క ఇంకొంచం పెరగవచ్చు. ఓవరాల్ మొదటి వారాన్ని సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఇప్పుడు కంప్లీట్ చేసుకోబోతుంది. ఇక ఫస్ట్ వీక్ అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.