బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని బడ్జెట్ తో రూపొంది భారీ అంచనాల నడుమ సంక్రాంతికి రిలీజ్ అయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్(Game Changer Movie) అంచనాలను అందుకుని ఉంటే ఓ రేంజ్ లో కుమ్మేసి ఉండేది కానీ మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ వలన అలాగే ఇతర సంక్రాంతి సినిమాల బెటర్ టాక్ వలన…
ఏమాత్రం అంచనాలను అయితే అందుకోవడం లేదు….ఆడియన్స్ కి ఓవరాల్ గా మూడో ఆప్షన్ గానే మిగిలిన సినిమా ఇతర సినిమాల ఓవర్ ఫ్లో లను సొంతం చేసుకుంటుంది ఇప్పుడు…ఇక మొదటి వారాన్ని పూర్తి చేసుకునే పనిలో ఉన్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా…
ట్రాక్ చేసిన సెంటర్స్ లో మరోసారి 35-40% రేంజ్ లో డ్రాప్స్ ను ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో సొంతం చేసుకుంది. ఇక ఆఫ్ లైన్ లో పర్వాలేదు అనిపిస్తూ ఉన్నప్పటికీ ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 2 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని…
సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరిగవచ్చు…ఇక హిందీ లో ఓకే అనిపించేలా పెర్ఫార్మ్ చేస్తున్నా మిగిలిన చోట్ల మాత్రం డ్రాప్స్ కొనసాగుతూ ఉండగా ఓవరాల్ గా 7వ రోజున వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 2.7-3 కోట్ల రేంజ్ లో షేర్ ని…
సొంతం చేసుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే షేర్ కొంచం పెరిగే అవకాశం ఉంది. సినిమా అందుకోవాల్సిన మమ్మోత్ టార్గెట్ దృశ్యా అసలు ఈ కలెక్షన్స్ సరిపోవు అనే చెప్పాలి ఇప్పుడు. ఇక టోటల్ గా సినిమా మొదటి వారానికి గాను ఏరియాల వారిగా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.