బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్న అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) మూవీ సాలిడ్ రికవరీని సొంతం చేసుకోగా ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయినా కూడా మంచి హోల్డ్ ని చూపెడుతూ దుమ్ము లేపుతూ ఉంది..
6వ రోజున అనుకున్న రేంజ్ కన్నా బెటర్ గా జోరు చూపించిన సినిమా ఇప్పుడు 7వ రోజున మరో వర్కింగ్ డే లో అన్ని చోట్లా మరోసారి సాలిడ్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా తమిళ్ లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపిస్తున్న సినిమా మిగిలిన చోట్ల మాత్రం కొంచం డ్రాప్స్ ను సొంతం చేసుకుంది..
తెలుగు రాష్ట్రాల్లో లిమిటెడ్ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఈ రోజు ఇక్కడ 30 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక తమిళనాడులో డ్రాప్స్ లిమిటెడ్ గానే ఉండటంతో ఈ రోజు సినిమా ఇక్కడ…
5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో కూడా వర్కింగ్ డేస్ వలన డ్రాప్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా సినిమా మంచి హోల్డ్ ని చూపెడుతూ వరల్డ్ వైడ్ గా 7వ రోజున ఇప్పుడు…
అటూ ఇటూగా 7-7.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని మినిమమ్ అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే కనుక ఈ లెక్క ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఎక్స్ లెంట్ గా జోరు చూపెడుతున్న సినిమా మొత్తం మీద మొదటి వారంలో ఏరియాల వారిగా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.