మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అండర్ పెర్ఫార్మ్ చేసినా కూడా వీకెండ్ లో ఓవరాల్ గా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న(Hi Nanna Movie) వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం కొంచం స్లో డౌన్ అయింది కానీ ఉన్నంతలో బ్రేక్ ఈవెన్ వైపు…
ఒక్కో అడుగు ముందుకేస్తూ దూసుకు పోతున్న సినిమా 6వ రోజుతో పోల్చితే 7వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా ఓవరాల్ గా డీసెంట్ గానే హోల్డ్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు అటూ ఇటూగా…
50 లక్షల రేంజ్ నుండి 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1 కోటి రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద మొదటి వారాన్ని మంచి కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోబోతుంది.
మొదటి రోజు సాలిడ్ గా స్టార్ట్ ను సొంతం చేసుకుని ఉంటే సినిమా ఈ పాటికి బ్రేక్ ఈవెన్ ని అందుకుని ఉండేది. అయినా కానీ ఉన్నంతలో సినిమా మంచి కలెక్షన్స్ తో మొదటి వీక్ ని కంప్లీట్ చేసుకోబోతుండగా రెండో వీక్ లో పోటి లేదు కాబట్టి సినిమా జోరుని కొనసాగించే అవకాశం ఎంతైనా ఉంది.