లాంగ్ వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని మిక్సుడ్ రెస్పాన్స్ తోనే సొంతం చేసుకున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా, తెలుగు మరియు కేరళ ఏరియాల్లో మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగలగా మిగిలిన చోట్ల మాత్రం సినిమా బాగానే జోరు చూపిస్తుంది.
ముఖ్యంగా తమిళనాడు మరియు ఓవర్సీస్ లలో సినిమా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా కూడా బ్రేక్ ఈవెన్ కి పరుగులు పెడుతూ ఉంది. వర్కింగ్ డేస్ లో మంచి హోల్డ్ ని చూపెడుతున్న సినిమా..
7వ రోజు మరోసారి ఓవరాల్ గా అన్ని చోట్లా మంచి రచ్చ చేస్తుంది. తెలుగు అండ్ కేరళలో డ్రాప్స్ కొనసాగుతూనే ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉన్న సినిమా తమిళనాడులో మరోసారి మంచి జోరు ని చూపెడుతూ ఇప్పుడు…
7-8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది, ఇక హిందీ, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో పర్వాలేదు అనిపిస్తున్న సినిమా ఓవర్సీస్ లో కొంచం స్లో అయినా స్టడీగానే ఉంది. దాంతో వరల్డ్ వైడ్ గా ఇప్పుడు మరోసారి సినిమా…
12-13 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, అన్ని చోట్లా ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. సినిమాకి రెండో వీక్ లో పెద్దగా పోటి ఏమి లేదు కాబట్టి ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా మొదటి వారంలో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.