మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజ్ రవితేజల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మాస్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఇప్పుడు 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని మెగాస్టార్ కి మెగా కంబ్యాక్ మూవీ గా నిలిచి దుమ్ము లేపుతూ ఉండగా ఇక ఇప్పుడు మొదటి వారాన్ని సూపర్బ్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధం అవుతుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు….
6వ రోజు తో పోల్చితే 7వ రోజు మరోసారి మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. సినిమా నైజాంలో కూడా నిన్నటి నుండి ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేయగా ఆంధ్ర సీడెడ్ ఏరియాలలో మరోసారి లిమిటెడ్ డ్రాప్స్ తోనే పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.
మొత్తం మీద ఇప్పుడు సినిమా 6వ రోజుతో పోల్చితే 7వ రోజు 35% లోపే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తూ ఉంటె 4.5-5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా….
5.2 కోట్ల రేంజ్ లోస్ షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా ఓవరాల్ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మొదటి రోజు నుండి అంచనాలను మించి కలెక్షన్స్ ని సాధిస్తున్న వాల్తేరు వీరయ్య ఇక మొదటి వారానికి గాను సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.