బాక్స్ ఆఫీస్ దగ్గర నాని కెరీర్ పీక్ టైం 2017 లో అని చెప్పాలి. ఆ టైం తర్వాత మళ్ళీ నాని నుండి ఆ ఇయర్ లో వచ్చినన్ని హిట్స్ రాలేదు కానీ నాని నటించిన సినిమాలు ఇక్కడ ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నప్పటికీ కూడా ఓవర్సీస్ లో మాత్రం చాలా బాగా దుమ్ము లేపుతూ దూసుకు పోతున్నాయి. దాంతో నాని మీడియం రేంజ్ హీరోలలో నంబర్ 1 గా దూసుకు పోతున్నాడు. ఓవర్సీస్ లో ఇప్పుడు నాని పేరిట…
మరో సెన్సేషనల్ రికార్డ్ వచ్చి చేరింది… నాని నటించిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ అమెరికాలో 1 మిలియన్ మార్క్ ని అందుకోగా నాని ఖాతాలో 7వ వన్ మిలియన్ మూవీ గా నిలిచింది అంటే సుందరానికీ. ఈ సినిమా కన్నా ముందు నాని నటించిన….
ఈగ, భలే భలే మొగాడివోయ్, నేను లోకల్, నిన్ను కోరి, MCA, జెర్సీ సినిమాలు 1 మిలియన్ మార్క్ ని అందుకున్నాయి…. ఇప్పుడు అంటే సుందరానికీ 7వ 1 మిలియన్ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలిచి దుమ్ము లేపగా మీడియం రేంజ్ హీరోలలో ఎవ్వరూ కూడా నాని దరిదాపుల్లో కూడా లేక పోవడం…
అమెరికాలో నాని మార్కెట్ కి నిదర్శనం అని చెప్పాలి. శ్యామ్ సింగ రాయ్ సినిమా పుష్ప, స్పైడర్ మాన్ సినిమాల వలన 1 మిలియన్ అందుకోలేదు. మరి కొన్ని సినిమాలు కూడా 1 మిలియన్ కి చేరువ రాగా ఓవరాల్ గా మీడియం రేంజ్ హీరోల పరంగా హైయెస్ట్ 1 మిలియన్ మూవీస్ తో నాని టాప్ లో దుమ్ము లేపుతున్నాడు… దాంతో పాటే ఓవరాల్ గా మహేష్ బాబు 11 సినిమాల తర్వాత…
7 సినిమాలతో రెండో ప్లేస్ లో ఉన్న ఎన్టీఆర్ ని సమం చేస్తూ మిగిలిన స్టార్ హీరోల కన్నా కూడా 1 మిలియన్ మూవీస్ పరంగా దుమ్ము లేపుతూ దూసుకు పోతున్నాడు నాని…. ఈ రికార్డ్ ను ఫ్యూచర్ లో కూడా కొనసాగించే అవకాశం ఉండగా నాని రికార్డ్ ను ఇతర మీడియం రేంజ్ హీరోలు అందుకోవాలి అంటే ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.