Home TRP రేటింగ్ లాస్ట్ వీక్ టాప్ TRP రేటింగ్ లు సాధించిన టాప్ 10 మూవీస్!

లాస్ట్ వీక్ టాప్ TRP రేటింగ్ లు సాధించిన టాప్ 10 మూవీస్!

1780
0

ప్రతీ వారం లానే లాస్ట్ వీక్ కూడా మళ్ళీ వరుస పెట్టి సినిమాలు టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యాయి, కానీ ఈ సారి వెరైటీగా కొన్ని సినిమాలు వర్కింగ్ డేస్ లో వేసినప్పటికీ కూడా TRP రేటింగ్ లిస్టు లో చోటు సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పొచ్చు. మొత్తం మీద 21 వ సారి ప్రైమ్ టైం లో టెలికాస్ట్ అయిన రామ్ చరణ్ వినయ విదేయ రామ 3.41 రేటింగ్ ని సాధించింది.

Tollywood "Top 10" Movies In "Karnataka" State

ఇక మొత్తం మీద లాస్ట్ వీక్ టాప్ 10 రేటింగ్ లను అందుకున్న సినిమాలను గమనిస్తే… 11 వ ప్లేస్ లో రామ్ నటించిన హలో గురు ప్రేమ కోసమే సినిమా 2.07 రేటింగ్ ను సాధించింది. ఇక 10 వ ప్లేస్ లో ప్రభాస్ పౌర్ణమి సినిమా వీక్ డే లో టెలికాస్ట్ అయ్యి 2.07 రేటింగ్ ను అందుకోగా…

Krishna Area All Time Top 10 Share Movies

9 వ ప్లేస్ కి వస్తే మగధీర సినిమా వీక్ డే లో టెలికాస్ట్ అయ్యి 2.34 రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇక 8 వ ప్లేస్ లో గీత గోవిందం సినిమా 2.36 రేటింగ్ ను సొంతం చేసుకోగా 7 వ ప్లేస్ లో నాయక్ సినిమా వీక్ డే లో 2.53 రేటింగ్ ను అందుకుంది.

Guntur Area All Time Top 10 Share Movies

ఇక 6 వ ప్లేస్ లో అరుంధతి సినిమా 2.78 రేటింగ్ ను అందుకుని దుమ్ము లేపగా 5 వ ప్లేస్ లో వెంకటేష్ రాజా సినిమా 2.94 రేటింగ్ తో కుమ్మేసింది. ఇక 4 వ ప్లేస్ లో విజయ్ పోలీసోడు సినిమా 2.96 రేటింగ్ ను సొంతం చేసుకోగా 3 వ ప్లేస్ కి వస్తే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా 3.05 రేటింగ్ ను సొంతం చేసుకుని టాప్ 3 తో కుమ్మేసింది.

Nellore Area All Time Top 10 Share Movies

ఇక రెండో ప్లేస్ లో రామ్ చరణ్ వినయ విదేయ రామ 3.4 రేటింగ్ ను సొంతం చేసుకుని సూపర్ సాలిడ్ హోల్డ్ ని కొనసాగించగా టాప్ ప్లేస్ లో రామ్ నటించిన రెడ్ మూవీ 3.77 రేటింగ్ ను సొంతం చేసుకుని లాస్ట్ వీక్ మూవీస్ లో టాపర్ గా నిలిచింది. ఇక వచ్చే వారం ఈ లిస్టులో ఎన్ని సినిమాలు చోటు ని సొంతం చేసుకుంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here