బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ అన్ని రోజులు కలెక్షన్స్ పరంగా అండర్ పెర్ఫార్మ్ చేస్తూ రోజు అనుకున్న కలెక్షన్స్ కన్నా తక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ వచ్చిన లవ్ స్టొరీ ఎట్టకేలకు బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపింది. 7 వ రోజు కన్నా ఇప్పుడు 8 వ రోజు ఎక్కువ వసూళ్ళని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ వీకెండ్ ని గ్రోత్ తో దుమ్ము లేపడానికి సిద్ధం అవుతుంది…
సినిమా 7 వ రోజుతో పోల్చితే 8 వ రోజు ఓపెనింగ్స్ ఆశించిన మేర లేకున్నా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. దాంతో 25-30 లక్షల రేంజ్ కలెక్షన్స్ వస్తాయి అనుకుంటే సినిమా ఆ మార్క్ ని దాటేసి తర్వాత 7వ రోజు సాధించిన 39 లక్షల షేర్ ని…
క్రాస్ చేసి 8 వ రోజున 49 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇది కచ్చితంగా సినిమా గ్రోత్ కి నిదర్శనం అనే చెప్పాలి. ఇక శని ఆదివారాల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరికాస్త జోరు పెంచడానికి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇక సినిమా…
మొత్తం మీద 8 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 10.77Cr
👉Ceeded: 3.67Cr
👉UA: 2.53Cr
👉East: 1.38Cr
👉West: 1.16Cr
👉Guntur: 1.33Cr
👉Krishna: 1.15Cr
👉Nellore: 73L
AP-TG Total:- 22.70CR(36.90CR~ Gross)
Ka+ROI: 1.50Cr~(updated)
OS – 4.56Cr~
Total WW: 28.76CR(51.15CR~ Gross)
ఇదీ సినిమా 8 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క…
8వ రోజు గ్రోత్ చూపడంతో ఇక వీకెండ్ మొత్తం సినిమా స్ట్రాంగ్ గా ఉండే అవకాశం ఉంది, ఇక సినిమా 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే 8 రోజుల తర్వాత ఇంకా 3.24 కోట్ల షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది, శని ఆదివారాల్లో జోరు పెంచితే ఈ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పొచ్చు.
Republic 1 day collections pettu raa nayana
Bro I am asking many times please republic 1 st day collections upload it it