ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని పూర్తీ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో సూపర్ సాలిడ్ గానే హోల్డ్ చేసింది. 8 వ రోజు డౌన్ అవ్వడంతో 9 వ రోజు కూడా సినిమా డౌన్ అవుతుందేమో అన్నట్లు అనిపించినా సినిమా అందరినీ ఆశ్యర్యపరుస్తూ 9 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ గ్రోత్ నే సొంతం చేసుకుంది.
సినిమా 8 వ రోజు 1.39 కోట్ల షేర్ ని అందుకుంటే 9 వ రోజు 1.5 కోట్ల రేంజ్ కి వెళుతుంది అనుకుంటే అంతకుమించి దుమ్ము లేపిన సినిమా ఏకంగా 2.38 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని 8 వ రోజు టాలీవుడ్ మూవీస్ పరంగా వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని…
సొంతం చేసుకున్న సినిమాగా సంచలనం సృష్టించి దుమ్ము లేపింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇతర భాషల్లో కూడా సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. మొత్తం మీద 8 రోజులు పూర్తీ అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా పుష్ప సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క ని ఒకసారి గమనిస్తే….
👉Nizam: 33.99Cr(inc GST)
👉Ceeded: 11.65Cr
👉UA: 6.20Cr
👉East: 4.03Cr
👉West: 3.34Cr
👉Guntur: 4.34Cr
👉Krishna: 3.51Cr
👉Nellore: 2.56Cr
AP-TG Total:- 69.62CR(105.50CR~ Gross)
👉Karnataka: 9.05Cr
👉Tamilnadu: 7.56Cr
👉Kerala: 3.60Cr
👉Hindi: 14.15Cr
👉ROI: 2.09Cr
👉OS – 11.05Cr
Total WW: 117.12CR(205CR~ Gross)
ఇదీ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్.
8వ రోజు ఎక్స్ లెంట్ గ్రోత్ ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు మళ్ళీ బ్రేక్ ఈవెన్ రేసులోకి ఎంటర్ అయిన సినిమా ఇప్పుడు 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఇంకా 28.88 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే సరిపోతుంది. సినిమా ఈ వీకెండ్ కుమ్మేయడం ఖాయంగా ఉండటంతో బ్రేక్ ఈవెన్ ఛాన్సులు ఉన్నాయని చెప్పొచ్చు.