బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఎక్స్ ట్రా ఆర్డినరీ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ రెండో వారంలో అడుగు పెట్టగా రెండో వారంలో మొదటి రోజు అయిన 8వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో 8 వ రోజు ఉగాది హాలిడే ముందు రోజు కావడం తో…
ఈవినింగ్ షోలలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ గ్రోత్ ని చూపెట్టి దుమ్ము లేపగా సినిమా 8వ రోజు 7 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అనుకున్నా కానీ జోరు పెంచి ఇంకా ముందుకు వెళ్లి ఏకంగా 8 కోట్ల మార్క్ ని కూడా దాటేసి 8.33 కోట్ల షేర్ మార్క్ ని…
అందుకుని దుమ్ము లేపింది. ఇక వరల్డ్ వైడ్ గా కూడా జోరు చూపిన సినిమా 19-20 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా కానీ ఏకంగా 22 కోట్ల కి పైగా షేర్ ని 8వ రోజు సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. మొత్తం మీద సినిమా ఇప్పుడు…
బాక్స్ ఆఫీస్ దగ్గర 8 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 81.53Cr
👉Ceeded: 38.63Cr
👉UA: 21.75Cr
👉East: 11.67Cr
👉West: 10.08Cr
👉Guntur: 14.43Cr
👉Krishna: 11.14Cr
👉Nellore: 6.75Cr
AP-TG Total:- 195.98CR(292.50CR~ Gross)
👉KA: 29.60Cr
👉Tamilnadu: 27.15Cr
👉Kerala: 8.50Cr~
👉Hindi: 71.80Cr
👉ROI: 5.45Cr
👉OS – 76.40Cr
Total WW: 414.88CR(Gross- 751CR~)
ఇదీ మొత్తం మీద సినిమా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క…
సినిమా ను బాక్స్ ఆఫీస్ దగ్గర 451 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోవాలి అంటే ఇంకా 38.12 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి…