టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకప్పుడు బరువు ఎక్కువగా ఉండేవారు అన్న విషయం అందరికీ రాఖీ టైం లో మరీ ఓవర్ వెయిట్ వలన ట్రోల్ కూడా అయ్యారు, కానీ యమదొంగ నుండి లుక్ విషయం లో ఎవ్వరూ వంక పెట్టని విధంగా మారిపోయిన ఎన్టీఆర్, టెంపర్ సినిమా కోసం మొదటి సారి సిక్స్ ప్యాక్ లో కనిపించి మెప్పించాడు. ఇక అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ కి…
ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే, అలాంటిది దానికి మించి ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ బాడీ ఓ రేంజ్ లో ఉంటుంది అని ముందు నుండి హైప్ ఇవ్వగా ఈ లోపు ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్ ఇంట్రో టీసర్ తో చరణ్ అల్టిమేట్ బాడీ తో కుమ్మేశాడు.
దాంతో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుంది బాడీ ఏ రేంజ్ లో పెంచాడు అని ఆశగా ఎదురు చూడగా ఇప్పుడు కొమరం భీమ్ ఇంట్రో టీసర్ లో ఎన్టీఆర్ బాడీ పై ఓ రేంజ్ లో ప్రశంసల జల్లు కురుస్తూ ఉండగా ఈ బాడీ కోసం ఎన్టీఆర్ షూటింగ్ కి ముందు 8 గంటల నాన్ స్టాప్…
జిమ్ చేశారని తర్వాతే షూటింగ్ లో పాల్గొన్నారని అంటున్నారు… ఇక రామ్ చరణ్ కూడా ఇంట్రో టీసర్ లో కొన్ని షాట్స్ కి ముందు ఉదయం 5 గంటల జిమ్ తర్వాత షూటింగ్ లో ఎంటర్ అయ్యారట. వీళ్ళ ఇద్దరి కష్టమే ఇప్పుడు సినిమా మరో లెవల్ కి చేరేలా చేస్తుండగా…
లేట్ అయినా ఎన్టీఆర్ తన ఇంట్రో టీసర్ లో కనిపించిన విధానం ఆ లుక్ కోసం పడ్డ కష్టం చూసి అందరూ తనకి హాట్సాఫ్ చెబుతున్నారని చెప్పొచ్చు. టీసర్ లో గ్లిమ్స్ లా కొన్ని షాట్స్ తో సరిపెట్టినా టీసర్ ట్రైలర్ వచ్చాక రచ్చ మరో రేంజ్ లో ఉండేలా జక్కన్న ప్లాన్ చేయడం ఖాయమని చెప్పొచ్చు.