Home న్యూస్ 8 మిలియన్ వ్యూస్ తో మెగా విజృంభణ

8 మిలియన్ వ్యూస్ తో మెగా విజృంభణ

347
0

  టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో అత్యంత భారీ ఎత్తున రూపొందుతున్న సినిమా వినయ విధేయ రామ. సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ ని టీసర్ ని దీపావళి కానుకగా రిలీజ్ చేయగా అద్బుతమైన పాజిటివ్ రెస్పాన్స్ తో దుమ్ము లేపుతుంది ఈ టీసర్. ముఖ్యంగా టీసర్ రికార్డుల విషయంలో స్లో గా మొదలైనా మెల్లిగా పుంజుకుంటూ ఇప్పుడు దూసుకు పోతుంది అని చెప్పొచ్చు.

మొత్తం మీద 12 గంటల లోపే సినిమా టీసర్ అన్నీ సోషల్ మీడియా మాధ్యమాలలో సుమారు గా 8 మిలియన్ డిజిటల్ వ్యూస్ ని అందుకోబోతున్నట్లు సమాచారం. యూట్యూబ్ లో ఇప్పటికే 4 మిలియన్స్ కి పైగా డిజిటల్ వ్యూస్ ని కంప్లీట్ చేసుకుంది ఈ టీసర్.

ఇక అందులో లైక్స్ పరంగాను 180k+ లైక్స్ ని కూడా సాధించి జోరు చూపుతుండగా మొత్తం మీద ఇప్పుడు 24 గంటల విషయంలో ఈ టీసర్ మరిన్ని రికార్డులు నమోదు చేయడం ఖాయమని అంటున్నారు. సైరా టీసర్ 12 మిలియన్ డిజిటల్ వ్యూస్ ని, భరత్ అనే నేను 11.6 మిలియన్ వరకు డిజిటల్ వ్యూస్ ని 24 గంటల్లో సాధించింది. మరి ఈ టీసర్ ఎంత దూరం వెళుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here