ఒక పక్క కొత్తగా వచ్చిన సినిమాలకే రేటింగ్ లు అనుకున్న రేంజ్ లో రావడం లేదు, డిజిటల్ రిలీజ్ వలన టెలివిజన్ రేటింగ్ లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది అని అంతా అనుకుంటున్న టైం లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ మూవీ నరసింహా సినిమా తమిళ్ లో ఊహకందని రికార్డ్ ను నమోదు చేసి టోటల్ ఇండస్ట్రీ నే షేక్ చేసే రేంజ్ లో కొత్త రికార్డ్…
క్రియేట్ చేసి దుమ్ము దుమారం అయ్యేలా చేసింది. ఈ సినిమా 22 ఏళ్ల క్రితం రిలీజ్ అయినప్పుడు బాక్స్ అఫీస్ దగ్గర ఓ రేంజ్ లో అద్బుతాలు చేసింది. తర్వాత టెలివిజన్ లో కూడా ఎప్పటికప్పుడు ప్రైమ్ టైం లో టెలికాస్ట్ అవుతూ సాలిడ్ రేటింగ్ లను సొంతం చేసుకునే…
నరసింహా సినిమా తెలుగు లో ఇప్పటికీ వారం పది రోజులకు ఒకసారి టెలివిజన్ లో జెమినీ లో టెలికాస్ట్ అవుతూనే ఉంటుంది, కానీ తమిళ్ లో లాస్ట్ 8-9 ఏళ్ళుగా ఈ సినిమా టెలికాస్ట్ అవ్వలేదు, సినిమా టెలివిజన్ రైట్స్ ఎక్స్ పైర్ అవ్వడంతో మళ్ళీ రెన్యూ చేయలేదు ఛానెల్ వాళ్ళు…
దాని వెనక వేరే రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి అంటారు కోలివుడ్ లో, అది వేరే విషయం అయినా ఎట్టకేలకు 8 ఏళ్ళు కంప్లీట్ అయ్యాక రీసెంట్ గా సినిమాను అక్కడ టెలివిజన్ లో టెలికాస్ట్ చేశారు. సన్ టీవీ ఛానెల్ లో సినిమాను టెలికాస్ట్ చేయగా సినిమా ఇంత గ్యాప్ తర్వాత టెలికాస్ట్ అయిన ఏ సినిమా కూడా ఊహలో కూడా సాధించని విధంగా ఏకంగా…
17.75 TRP రేటింగ్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇది ఆల్ మోస్ట్ కొత్త సినిమాలకు అతి కొద్ది సార్లు మాత్రమే వచ్చే రేటింగ్, ఈ రేటింగ్ కూడా ఇండియా న్యూజిలాండ్ వరల్డ్ కప్ మ్యాచ్ రోజున వేసినా ఈ రేంజ్ లో వచ్చింది, అదే ఎలాంటి పోటి లేని టైం లో వేసి ఉంటే 20 కి పైగా రేటింగ్ సొంతం అయ్యేది ఈ సినిమా కి అని అంటున్నారు.