800 పైనే…రామ్ ఈ సారి గట్టిగా కొట్టాలి!

0
287

  యంగ్ హీరో రామ్ మరియు అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో త్రినిధ రావ్ నక్కిన డైరెక్షన్ లో దిల్ రాజు బ్యానర్ లో రిలీజ్ అవుతున్న లేటెస్ట్ మూవీ హెలో గురు ప్రేమ కోసమే… టీసర్ వరకు ఎలా ఉన్నా ట్రైలర్ తో మంచి అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిధ్ధం అవుతుంది. ఓవరాల్ గా 24 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా..

రెండు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది, నైజాం లో 200 వరకు థియేటర్స్ లో సీడెడ్ లో 150 వరకు థియేటర్స్ లో టోటల్ ఆంధ్రా లో 250 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కర్నాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 150 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

ఇక ఓవర్సీస్ లో 130 లొకేషన్స్ లో ప్రీమియర్ షోల తో రిలీజ్ కానున్న ఈ సినిమా టోటల్ గా 800 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. బజ్ పాజిటివ్ గా ఉండటం తో రామ్ ఈ సారి కచ్చితంగా అంచనాలను అందుకుంటాడు అని అంతా భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here