యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యాయి…బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తర్వాత ఇప్పుడు తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ గా చెప్పుకుంటున్న లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమాతో దుమ్ము లేపడానికి సిద్ధం అవుతున్నాడు…
నాగ చైతన్య సాయి పల్లవిల క్రేజీ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా ఇద్దరి కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీగా రూపొందుతూ ఉండగా ఈ ఏడాదే ఆడియన్స్ ముందుకు వస్తుంది అనుకున్న ఈ సినిమా కొంచం డిలే అయ్యి సంక్రాంతికి వస్తుంది అన్న టాక్ అయితే వినిపించినా కూడా…
సంక్రాంతికి ఉన్న భారీ సినిమాల పోటి వలన ఇప్పుడు సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ ను చేశారు. సంక్రాంతి మూవీస్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న తండేల్ మూవీకి అనుకున్న రేంజ్ లో థియేటర్స్ సొంతం అయ్యే అవకాశం లేదని భావించిన…
మేకర్స్ సినిమాను బిగ్ సోలో రిలీజ్ కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరి టైంలో భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తూ ఉండగా ఇక సినిమా బడ్జెట్ లెక్కలు కూడా బయటికి వచ్చేశాయి. కాగా సినిమా ముందు 60 కోట్ల రేంజ్ లో బడ్జెట్ లో నిర్మాణం అవుతుంది అనుకున్నా కూడా….
ఏకంగా ఆ బడ్జెట్ పెరుగుతూ పెరుగుతూ 70 కోట్ల రేంజ్ లో బడ్జెట్ ను కూడా దాటేసి 75 ను కూడా అందుకుని ఏకంగా 80 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మాణం అవ్వగా సినిమా రిలీజ్ కి ప్రింట్స్ అండ్ పబ్లిసిటీ ఖర్చులతో కలిపి ఇప్పుడు 85 కోట్ల రేంజ్ లో ఖర్చు కాబోతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఫిబ్రవరి టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.