బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ రికార్డులను సృష్టించడానికి సిద్ధం అవుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న ఈ సెన్సేషనల్ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోతూ ఉండగా సినిమా కి జరిగిన మమ్మోత్ బిజినెస్ తర్వాత అదే రేంజ్ మమ్మోత్ రిలీజ్ సొంతం కాబోతూ ఉండగా…
సినిమాకి టాలీవుడ్ హిస్టరీలోనే ఏ సినిమాకి కూడా సొంతం కాని రేంజ్ లో టికెట్ హైక్స్ సొంతం అవ్వగా అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని చోట్లా కూడా సెన్సేషనల్ బుకింగ్స్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతుంది. కాగా సినిమా రిలీజ్ కి ఇంకా 2 రోజుల టైం ఉండగా…
టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ మమ్మోత్ 80 కోట్ల మార్క్ ని అందుకుని 100 కోట్ల గ్రాస్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండటం. సినిమా హిందీలో సెన్సేషనల్ స్టార్ట్ తర్వాత బుకింగ్స్ ట్రెండ్ లో కొంచం స్లో నెస్ అయితే వచ్చింది కానీ…
స్టడీ బుకింగ్స్ తో సినిమా హిందీ వర్షన్ గ్రాస్ బుకింగ్స్ 22 కోట్ల మార్క్ ని అందుకోగా, తెలుగు రాష్ట్రాల్లో సినిమా గ్రాస్ బుకింగ్స్ ఫెంటాస్టిక్ జోరుని చూపెడుతూ 20 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టిస్తూ దూసుకు పోతూ ఉంది ఇప్పుడు…ఇక టోటల్ తెలుగు వర్షన్ 25 కోట్ల రేంజ్ లో…
గ్రాస్ మార్క్ ని అందుకోగా ఇతర వర్షన్ ల గ్రాస్ లెక్క ఓవరాల్ గా 3.5 కోట్లకు పైగా ఉండగా ఇండియన్ గ్రాస్ బుకింగ్స్ లెక్క 50.50 కోట్లకు పైగా ఉండగా, ఓవర్సీస్ లో సినిమా 3.4 మిలియన్ డాలర్స్ మార్క్ రేంజ్ లో ఉండగా ఇండియన్ కరెన్సీలో 29 కోట్ల రేంజ్ లో ఉందని అంచనా…
దాంతో వరల్డ్ వైడ్ గా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ లెక్క 80 కోట్ల మార్క్ ని అందుకుని 100 కోట్ల గ్రాస్ మార్క్ దిశగా దూసుకు పోతుంది…సినిమా ఓవరాల్ గా ఊపు చూస్తూ ఉంటే బిగ్గెస్ట్ రికార్డుల జాతరతో ఇండస్ట్రీ రికార్డులను సైతం నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందీ అనిపించేలా దూసుకు పోతుంది.