నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమా వలన స్లో డౌన్ అయిన సినిమా ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసిన సినిమా…
ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా బాలయ్య కెరీర్ లో అయితే రికార్డులను నమోదు చేస్తూ మాస్ రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి. బాక్ టు బాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలతో దూసుకు పోతున్న బాలయ్య కెరీర్ లో ఇప్పుడు ఆల్ టైం హైయెస్ట్ షేర్ ని సొంతం చేసుకున్న….
సినిమా గా డాకు మహారాజ్ మూవీ సంచలనం సృష్టించింది….బాలయ్య నటించిన సినిమాల్లో రెండేళ్ళ క్రితం సంక్రాంతికి రిలీజ్ అయిన వీర సింహా రెడ్డి సినిమా టోటల్ రన్ లో 79.82 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని 80 కోట్ల మార్క్ ని మిస్ చేసుకున్నా కూడా…
ఓవరాల్ గా బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ షేర్ ని అందుకున్న సినిమాగా నిలిచింది. ఆల్ మోస్ట్ బాలయ్య నటించిన లాస్ట్ మూడు సినిమాలు 130 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను 75 కోట్ల రేంజ్ లో యావరేజ్ గా షేర్ మార్క్ ని అందుకోగా….
ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీ మాత్రం ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తర్వాత స్లో అయినా కూడా లాంగ్ రన్ లో స్టడీగానే జోరు చూపించి ఇప్పుడు 15వ రోజు సండే సాధించిన కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 80 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని…
బాలయ్య కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ షేర్ మార్క్ ని అందుకున్న సినిమాగా సంచలనం సృష్టించింది..సంక్రాంతికి వస్తున్నాం ఊరమాస్ జాతర వలన స్లో అయింది కానీ ఈ పాటికే సినిమా బ్రేక్ ఈవెన్ ని కూడా దాటేసి ఉండేది. అయినా ఓవరాల్ గా లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ ని కూడా అందుకునే అవకాశం ఎంతైనా ఉంది.