బాక్స్ ఆఫీస్ దగ్గర 8 వ రోజు సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పుడు 9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మరోసారి అంచనాలను మించి పోతుంది సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 22 కోట్ల నుండి 23 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది.
ఇక హిందీ లో ఈ రోజు 21-22 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద సినిమా 10-12 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా టోటల్ ఇండియా లో సినిమా ఇప్పుడు 54-55 కోట్ల రేంజ్ లో…
గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ తో సినిమా 60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఫైనల్ లెక్కలు అన్ని చోట్లా బాగుంటే ఇంకా పెరిగే ఔట్ రైట్ ఛాన్స్ కూడా ఉంది. ఈ కలెక్షన్స్ తో సినిమా ఓవరాల్ గా 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 810 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోవచ్చు. మరి టోటల్ కలెక్షన్స్ అంచనాలను మించుతుందో లేక ఇదే రేంజ్ లో ఉంటుందో చూడాలి.