బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) 2 సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు, ఇయర్ ఫస్టాఫ్ ఎండ్ టైంలో ఆదిపురుష్(AdiPurush) మూవీతో వచ్చి ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్నా కూడా తర్వాత విపరీతమైన ట్రోల్స్ ను ఫేస్ చేయాల్సి రావడంతో…
బాక్స్ ఆఫీస్ రన్ ను త్వరగానే కంప్లీట్ చేసుకోవాల్సి వచ్చింది, ఇక ఇయర్ ఎండ్ టైంలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన సలార్(salaar part 1 – ceasefire) తో వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటూ దుమ్ము లేపే కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంటూ ఉండగా…
ఈ సినిమా ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర 430 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా ఈ ఇయర్ వచ్చిన ఆదిపురుష్ సినిమా టోటల్ రన్ లో 397.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఆ సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ ను 4 రోజుల్లోనే బ్రేక్ చేసి సంచలనం సృష్టించిన ప్రభాస్…
ఇప్పుడు సలార్ తో 5 రోజులలో ఆల్ మోస్ట్ 430 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఓవరాల్ గా 2 సినిమాల టోటల్ కలెక్షన్స్ లెక్క ఇప్పుడు 825 కోట్లకు పైగా ఉండగా స్టడీ కలెక్షన్స్ తో పరుగును సూపర్బ్ గా కొనసాగిస్తున్న సలార్ మూవీ లాంగ్ రన్ లో కలెక్షన్స్ జోరుని ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…
మరి మొత్తం మీద సలార్ సినిమా లాంగ్ రన్ లో జోరు చూపించి ఓవరాల్ గా 2023 ఇయర్ కి గాను ప్రభాస్ 1000 కోట్ల మార్క్ ని అందుకుంటాడో లేదో చూడాలి. ఆ మార్క్ ని అందుకోవాలి అంటే సినిమా ఇంకా 170 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోవాల్సి ఉంటుంది. మరి లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.