Home న్యూస్ 85 కోట్ల బ్లాక్ బస్టర్ హీరో 2వ సినిమా బడ్జెట్ ఇంత తక్కువా!!

85 కోట్ల బ్లాక్ బస్టర్ హీరో 2వ సినిమా బడ్జెట్ ఇంత తక్కువా!!

3286
0

మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించే అవకాశం చాలా తక్కువ మంది హీరోలకే సొంతం అవుతూ ఉంటుంది… అలాంటి మొదటి సినిమాకే లోకల్ మూవీస్ రికార్డులే కాదు ఏకంగా ఇండియన్ సినిమా హిస్టరీ రికార్డులను కూడా తిరగరాసిన ఘనత మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ కి సొంతం అని చెప్పాలి. ఉప్పెన సినిమా తో హీరోగా కెరీర్ ని మొదలు పెట్టిన పంజా వైష్ణవ్ తేజ్ ఈ సినిమా తో….

ఏకంగా 85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియన్ సినిమా హిస్టరీలోనే డెబ్యూ మూవీ తో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న హీరోగా సంచలన రికార్డ్ కొట్టిన తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు…

పంజా వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా కొండపొలం ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. మొదటి సినిమా రిలీజ్ లేట్ అయిన టైం లో తక్కువ టైం లోనే ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవ్వగా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి ట్రై చేశారు కానీ…

ఈ లోపు ఉప్పెన సాధించిన అల్టిమేట్ హిట్ వలన ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ ను కన్ఫాం చేసుకోగా సినిమా ఓవరాల్ బడ్జెట్ లెక్కలు ఇప్పుడు ట్రేడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ లెక్కల ప్రకారం సినిమాను మొత్తం మీద 45 రోజుల వర్కింగ్ డేస్ లో తెరకెక్కించగా కేవలం 6.5 కోట్ల లోపు బడ్జెట్ లోనే సినిమా మొత్తం షూటింగ్ అయిపోయిందని…

ఇప్పుడు ట్రేడ్ లో టాక్ వినిపిస్తుంది. అందులో కూడా అందరికీ రెమ్యునరేషన్ పరంగా 4 కోట్లకు పైగా వెళ్ళగా మిగిలిన బడ్జెట్ లో షూటింగ్ కంప్లీట్ అయ్యిందని అంటున్నారు. ఇది కనుక నిజం అయితే…. అంత పెద్ద బ్లాక్ బస్టర్ హీరో నెక్స్ట్ మూవీ ఇంత తక్కువ బడ్జెట్ లో అవ్వడం విశేషం అనే చెప్పాలి… ఈ ఎక్స్ పెరిమెంటల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here