Home న్యూస్ 85 కోట్ల బ్లాక్ బస్టర్ హీరోకి…ఇలాంటి పరిస్థితి ఏంటి సామి!!

85 కోట్ల బ్లాక్ బస్టర్ హీరోకి…ఇలాంటి పరిస్థితి ఏంటి సామి!!

1445
0

బాక్స్ ఆఫీస్ దగ్గర చేసిన అన్ని సినిమాలు ఆడాలని రూల్ ఏమి లేదు కానీ ఒక సినిమా విజయం మరో సినిమా కి ఎంతో కొంత అడ్వాంటేజ్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఒక సినిమా ఊహకందని విజయం ఎఫెక్ట్ మరో సినిమా పై ఇసుమంత కూడా లేకుండా ఉండటం లేటెస్ట్ గా రిలీజ్ అయిన కొండ పొలం సినిమా విషయంలో జరిగింది.

ఈ సినిమా హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన ఫస్ట్ మూవీ ఉప్పెన లాస్ట్ ఇయరే రావాల్సిన లేట్ అవుతూ వచ్చినా రిలీజ్ టైం కి ఓ ఫస్ట్ హీరో సినిమా కి ఉండాల్సిన బజ్ కన్నా ఓ మీడియం రేంజ్ హీరో నటించే క్రేజీ సినిమా కి ఉండే హడావుడిని సొంతం చేసుకుని రిలీజ్ అయ్యి….

బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి సంచలన కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపగా ఆ సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ కి వరుస పెట్టి ఆఫర్ల వెల్లువ వచ్చింది ఇంతలో తను నటించిన రెండో సినిమా కొండ పొలం బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వగా వీకెండ్ లో…

అందరికీ సాలిడ్ శాకిచ్చే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది, క్రిష్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్ కీరవాణి లాంటి టాప్ నాట్చ్ మ్యూజిక్ డైరెక్టర్ వీటికి మించి 85 కోట్ల బ్లాక్ బస్టర్ ఉప్పెన లాంటి సక్సెస్ తర్వాత వచ్చిన కొండ పొలం బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో మినిమం ఇంపాక్ట్ ని కూడా…

చూపలేక వీకెండ్ కే చేతులు ఎత్తేసిన పరిస్థితి నెలకొంది. సినిమా వీకెండ్ కలెక్షన్స్ ఉప్పెన ఫస్ట్ డే కలక్షన్స్ లో మూడో వంతు కూడా లేక పోవడం సినిమా బాక్స్ ఆఫీస్ ఫేట్ కి నిదర్శనం. ఈ సినిమా జానర్ వేరు అయినా కానీ ఎండ్ ఆఫ్ ది డే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ మాత్రమే ముఖ్యం కాబట్టి సినిమా సాలిడ్ నిరాశనే మిగిలించింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here